భారతదేశం, అక్టోబర్ 9 -- OTT Review: మలయాళ సినీ ఇండస్ట్రీ నుంచి వచ్చే క్రైమ్ ఇన్వెస్టిగేషన్, ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్లకు మన దేశంలో ఉండే క్రేజే వేరు. రీసెంట్‌గా ప్రముఖ డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ సోనీ లివ్ (SonyLIV) వేదికగా ఆడియన్స్ ముందుకు వచ్చిన మలయాళం డార్క్ సైకలాజికల్ థ్రిల్లర్ 'ఐస్' (Eyes). ప్రముఖ నటి కని కుసృతి, నిఖిలా విమల్, శ్రుతి రామచంద్రన్ కాంబినేషన్‌లో దర్శకుడు మను అశోకన్ తెరకెక్కించిన ఈ సిరీస్ ప్రస్తుతం ఓటీటీ లవర్స్ దృష్టిని ఆకర్షిస్తోంది.

సమాజంలో మహిళలు రోజువారీ ఎదుర్కొనే సీరియస్ ప్రాబ్లమ్ 'స్టాకింగ్' (వేధింపులు, ఆకతాయిల వెంటపడటం) బ్యాక్‌డ్రాప్‌లో ఈ వెబ్ సిరీస్ కథ నడుస్తుంది. అయితే కేవలం ఒక రెగ్యులర్ పోలీస్ ప్రొసీజరల్ థ్రిల్లర్‌లా కాకుండా సైకాలజీ, సాఫ్ట్‌వేర్ ట్రాకింగ్‌ను మిక్స్ చేసి సరికొత్త యాంగిల్‌లో ప్రజెంట్ చేశారు. ...