భారతదేశం, ఏప్రిల్ 3 -- OTT Releases This Week: ఓటీటీ ప్రియులకు ఈ వారం పండగే అని చెప్పాలి. ఏప్రిల్ మొదటి వారంలో ప్రేక్షకులను అలరించేందుకు నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, జీ5, జియోహాట్‌స్టార్ వంటి ప్రధాన ప్లాట్‌ఫామ్‌లు సిద్ధమయ్యాయి. తెలుగు, హిందీ, తమిళంతో పాటు అంతర్జాతీయ సినిమాలు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. ఈ వారం డిజిటల్ వేదికపైకి రానున్న ఆ ఆసక్తికర చిత్రాల వివరాలు మీకోసం.

యంగ్ హీరో శ్రీవిష్ణు క్రైమ్ రిపోర్టర్ కావాలనుకునే అడ్వర్టైజ్మెంట్ ఎంప్లాయ్ 'జై' పాత్రలో కనిపించిన మూవీ ఇది. రెండు అనుమానాస్పద మరణాల వెనుక ఉన్న మిస్టరీని ఛేదించే క్రమంలో సాగే ఈ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ఏప్రిల్ 3 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లోకి అందుబాటులోకి వచ్చింది.

శివాజీ, లయ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ క్రైమ్ కామెడీలో ఒక నిజాయితీ గల పంచాయతీ సెక్రటరీ కుటుంబం ఒక హత్య కేసులో...