భారతదేశం, ఏప్రిల్ 13 -- OTT Releases This Week: వేసవి సెలవులు మొదలవుతున్న తరుణంలో ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ప్రేక్షకులకు బోర్ కొట్టకుండా భారీగా సినిమాలు, వెబ్ సిరీస్ తో ముందుకు రాబోతున్నాయి. నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, జీ5, జియో హాట్‌స్టార్ వంటి ప్రముఖ ప్లాట్‌ఫామ్‌లు ఈ వారం వైవిధ్యమైన కంటెంట్‌ను అందిస్తున్నాయి. యాక్షన్, థ్రిల్లర్, రొమాంటిక్ డ్రామా, స్పోర్ట్స్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రియులకు ఈ వారం విందు భోజనం లాంటిదని చెప్పవచ్చు. మొత్తంగా 15 సినిమాలు, వెబ్ సిరీస్ ఈవారం ఓటీటీలోకి రానున్నాయి.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్న 'ఉస్తాద్ భగత్ సింగ్' ఈ వారం అంటే ఏప్రిల్ 16న నెట్‌ఫ్లిక్స్‌లోకి అడుగుపెట్టనుంది. హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ పవర్‌ఫుల్ పోలీస్ డ్రామా తెలుగుతో పాటు సౌత్ భాషలన్నింటిలోనూ అందుబాటులోకి రానుంది....