భారతదేశం, అక్టోబర్ 24 -- OTT Release: కంటెంట్ ఓరియెంటెడ్, యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్లను ప్రోత్సహించడంలో ముందంజలో ఉండే ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫారమ్ 'ఈటీవీ విన్' (ETV Win) మరో సరికొత్త చిత్రంతో సిద్ధమైంది. అక్టోబర్ 2న థియేటర్లలో విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకున్న హార్ట్ టచింగ్ మెసేజ్ ఓరియెంటెడ్ ఫిల్మ్ 'తెల్ల కాగితం' (Thella Kaagitham) ఇప్పుడు ఇదే ఓటీటీలో డిజిటల్ స్క్రీన్‌పై సందడి చేయబోతోంది.

నిజ జీవితంలో జరిగిన కొన్ని యథార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఫీల్ గుడ్ టీనేజ్ డ్రామా తెల్ల కాగితం ఓటీటీలోకి వచ్చేస్తోంది. వచ్చే గురువారం అంటే అక్టోబర్ 29, 2026న ఈటీవీ విన్ (ETV Win) ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ మేరకు సదరు ఓటీటీ సంస్థ సోషల్ మీడియా వేదికగా అధికారిక పోస్టర్‌ను విడుదల చేస్తూ అనౌన్స్ చేసింది.

భీమవరం సమీపంలోని ఒక గ్రామానికి చెంది...