భారతదేశం, నవంబర్ 9 -- OTT Release: ప్రతీ వీకెండ్ ఓటీటీలో కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ కోసం ఎదురు చూసే వారికి ఈవారం కూడా పండగే అని చెప్పాలి. ఈరోజు నుంచి వచ్చే సండే వరకు ఏకంగా 14 కొత్త మూవీస్, సిరీస్ రానుండగా.. అందులో 8 ఒక్క నెట్‌ఫ్లిక్స్ లోనే కావడం విశేషం. యాక్షన్, థ్రిల్లర్, సస్పెన్స్, కామెడీ, సెంటిమెంట్ నుంచి యానిమేషన్ వరకు అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.

స్ట్రీమింగ్ తేదీ: నవంబర్ 9

ప్రసిద్ధ ఉబిసాఫ్ట్ (Ubisoft) గేమింగ్ క్యారెక్టర్ల ఆధారంగా తెరకెక్కిన అమెరికన్ యానిమేటెడ్ సిరీస్ ఇది. వేరే గ్రహం నుంచి భూమిపైకి వచ్చే విచిత్రమైన కుందేలు లాంటి జీవులు చేసే రచ్చ, హంగామా పిల్లలను ఎంతగానో అలరిస్తుంది.

స్ట్రీమింగ్ తేదీ: నవంబర్ 12

'పుష్పక్ రావు' అనే కుర్రాడి చుట్టూ తిరిగే తమిళ టైమ్-ట్రావెల్ డ్రామా ఇది. అతను ఎక్కిన ఒక స...