భారతదేశం, అక్టోబర్ 2 -- OTT Release: మలయాళ చిత్రసీమలో విశేష ఆదరణ పొందిన 'ఉయరే', 'కాణెక్కిణే' చిత్రాల దర్శకుడు మను అశోకన్ తెరకెక్కించిన తాజా సైకలాజికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ 'ఐస్' (Eyes). దేవ్‌ మోహన్, నిఖిలా విమల్, కని కుసృతి, శృతి రామచంద్రన్, సనియా అయ్యప్పన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్ స్ట్రీమింగ్ డేట్ ను ఇవాళ (అక్టోబర్ 2) ప్రకటించారు.

మలయాళ పరిశ్రమ నుంచి వచ్చే క్రైమ్ అండ్ సైకలాజికల్ థ్రిల్లర్లకు ఓటీటీలో ఉండే క్రేజ్ వేరు. ఆ కోవలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సరికొత్త ఒరిజినల్ వెబ్ సిరీస్ 'ఐస్'. డ్రీమ్‌క్యాచర్ బ్యానర్‌పై టి.ఆర్.షంషుద్దీన్ నిర్మించిన ఈ సిరీస్ అక్టోబర్ 9, 2026 నుంచి ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫామ్ సోనీ లివ్ (Sony LIV) వేదికగా స్ట్రీమింగ్ కానుంది.

మలయాళంతో పాటు తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఒకేసారి ఈ సిరీస్ అందుబాటులోకి ర...