భారతదేశం, నవంబర్ 7 -- Scene OTT Mahasakthi OTT Summer Holidays OTT: సినిమా ప్రియులకు బాక్సాఫీస్ వద్ద వినోదాల పంట పండుతోంది. థియేటర్లలో పెద్ద తెరపై చూసి ఎంజాయ్ చేయడం ఒకెత్తయితే, మనసుకు నచ్చిన చిత్రాన్ని ఇంటి వద్దే ఓటీటీ వేదికలపై వీక్షించాలనుకునే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది.

ఈ క్రమంలో ఇటీవల ఒకే రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'సీన్', 'మహాశక్తి', 'సమ్మర్ హాలీడేస్' ఓటీటీ స్ట్రీమింగ్ వివరాలు ఇంట్రెస్టింగ్‌గా మారాయి. నిన్న (నవంబర్ 6) థియేటర్లలో విడుదలైన ఈ మూడు సినిమాల ఓటీటీ రైట్స్ విశేషాలు, స్ట్రీమింగ్ వివరాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.

మలయాళ స్టార్ డైరెక్టర్ జీతూ మాధవన్ దర్శకత్వంలో స్టార్ హీరో సూర్య, నజ్రియా జంటగా నటించిన చిత్రం 'సీన్'. 12 ఏళ్ల విరామం తర్వాత నజ్రియా నజీమ్ నటించిన తమిళ సినిమా కావడం, కరుప్పు, విశ్వనాథ్ అండ్ సన్స్ వంటి విజ...