భారతదేశం, అక్టోబర్ 3 -- OTT Release: టాలీవుడ్‌లో సరికొత్త ప్రయోగాలతో తెరకెక్కిన రెండు క్రేజీ చిత్రాలు థియేటర్లలో సందడి చేస్తున్నాయి. ఒకటి మలయాళ స్టార్ ఫహాద్ ఫాజిల్ నేరుగా తెలుగులో నటించిన ఫాంటసీ డ్రామా 'డోంట్ ట్రబుల్ ది ట్రబుల్'. మరొకటి యంగ్ ఎలిమెంట్స్‌తో వచ్చిన ఎమోషనల్ టీనేజ్ లవ్ స్టోరీ 'తెల్లకాగితం'. ఈ రెండు చిత్రాల డిజిటల్ రైట్స్, కంటెంట్ వివరాలు ఇలా ఉన్నాయి.

దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి సమర్పణలో ఆర్కా మీడియా వర్క్స్, షోయింగ్ బిజినెస్ బ్యానర్లపై ఎస్.ఎస్. కార్తికేయ, శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని ఈ డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ చిత్రాన్ని నిర్మించారు. శశాంక్ యేలేటి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.

డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌ (Netflix) భారీ ధరకు సొంతం చేసుకుంది. తెలుగుతో ...