భారతదేశం, సెప్టెంబర్ 14 -- OTT Release: సెప్టెంబర్ 18న ఓటీటీ స్పేస్‌లో అంతర్జాతీయ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ (Netflix) భారీ ఆఫరింగ్స్‌తో ముందుకు వస్తోంది. థియేటర్లలో రూ.280 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి ఆల్-టైమ్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన రవితేజ, శివ నిర్వాణల 'ఇరుముడి' (Irumudi) చిత్రం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో గ్రాండ్‌గా డిజిటల్ ప్రీమియర్ కానుంది.

ఓటీటీ ఆడియన్స్ ఎంతో ఆత్రుతగా వెయిట్ చేస్తున్న ఇరుముడి మూవీ ఈ వారమే ఓటీటీలోకి వచ్చేస్తోంది. సెప్టెంబర్ 18 నుంచి నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. రవితేజ హీరోగా నటించిన ఈ మూవీ బాక్సాఫీస్ ను షేక్ చేసిన సంగతి తెలిసిందే.

నెట్‌ఫ్లిక్స్ లో సెప్టెంబర్ 18న ఈ క్రేజీ ప్రాజెక్టులు కూడా రిలీజ్ కానున్నాయి.

కేవలం నెట్‌ఫ్లిక్స్ మాత్రమే కాకుండా ఇతర ప్రముఖ ఓటీటీ వేదికలు కూడా బలమైన ప్రాంతీయ కంటెం...