భారతదేశం, ఆగస్టు 5 -- OTT Release: డిఫరెంట్ మూవీస్‌తో ప్రేక్ష‌కుల హృద‌యాల్లో త‌న‌దైన గుర్తింపు సంపాదించుకున్నాడు హీరో విజ‌య్ ఆంటోని. అతను ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన లేటెస్ట్ ఎమోష‌న‌ల్ బ్లాక్ బ‌స్ట‌ర్ ఫ్యామిలీ డ్రామా 'వంద దేవుళ్లు'. త‌మిళంలో 'నూరు సామి'గా రిలీజైన ఈ చిత్రం ఓటీటీలోకి రాబోతుంది.

'బిచ్చ‌గాడు' సినిమా విడుద‌లైన 10 సంవ‌త్స‌రాల‌ త‌ర్వాత విజ‌య్ ఆంటోని, డైరెక్ట‌ర్ శ‌శి కాంబోలో వ‌చ్చిన సినిమా ఇది. భావోద్వేగ కుటుంబ క‌థా చిత్రంగా వంద దేవుళ్లు తెర‌కెక్కింది. విజ‌య్ ఆంటోని ఫిల్మ్ కార్పొరేష‌న్ బ్యాన‌ర్‌పై విజయ్ ఆంటోనీ, ఫాతిమా విజయ్ ఆంటోని ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రం ఆగస్టు 7 నుంచి జీ5 ఓటీటీలో తెలుగు, త‌మిళ‌, కన్నడ, మలయాళ భాషల్లో ప్రత్యేకంగా స్ట్రీమింగ్ కానుంది.

'వంద దేవుళ్లు' (నూరు సామి) చిత్రంలో విజయ్ ఆంటోని, స్వాసిక, అజయ్ ధిషన్, ల...