భారతదేశం, మార్చి 16 -- సినిమా ప్రియులకు ఈ వారం ఓటీటీలో వినోదాల విందు భోజనం సిద్ధంగా ఉంది. మార్చి 16 నుంచి నెట్‌ఫ్లిక్స్, జీ5, జియో హాట్‌స్టార్ వంటి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లలో ఇంట్రెస్టింగ్ సినిమాలు, వెబ్ సిరీస్‌లు సందడి చేయనున్నాయి. యాక్షన్, థ్రిల్లర్, డాక్యుమెంటరీ ఇలా అన్ని రకాల జోనర్లలో విడుదలవుతున్న ఈ వారం ఓటీటీ సినిమాలు ఏంటో తెలుసుకుందాం.

1997 నాటి క్లాసిక్ వార్ ఫిల్మ్ 'బోర్డర్'కు ఇది సీక్వెల్. సన్నీ డియోల్, వరుణ్ ధావన్, దిల్జీత్ దోసాంజ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం 1971 నాటి 'ఆపరేషన్ చెంఘీజ్ ఖాన్' నేపథ్యంలో సాగుతుంది. యుద్ధ భూమిలో మన సైనికుల పరాక్రమాన్ని ఈ సినిమా మరోసారి కళ్లకు కట్టనుంది. నెట్‌ఫ్లిక్స్‌లో మార్చి 19 నుంచి బోర్డర్ 2 ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది.

ప్రముఖ ఓటీటీ సిరీస్ 'పీకీ బ్లైండర్స్'కు ముగింపుగా వస్తున్న ఈ చిత్ర...