భారతదేశం, మార్చి 10 -- బాలీవుడ్ మిస్టర్ పర్‌ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ (Aamir Khan) నటించిన ఎమోషనల్ అండ్ ఇన్‌స్పైరింగ్ మూవీ 'సితారే జమీన్ పర్'. ఈ సినిమా రిలీజ్ టైమ్‌లో అమీర్ ఒక సంచలన నిర్ణయం తీసుకున్నాడు. తన సినిమా ఎట్టి పరిస్థితుల్లో ఓటీటీ (OTT) లోకి రాదని, థియేట్రికల్ రన్ తర్వాత నేరుగా యూట్యూబ్ (YouTube) లోనే 'పే-పర్-వ్యూ' (Pay-per-view) పద్ధతిలో రిలీజ్ చేస్తానని తేల్చి చెప్పాడు. కానీ ఇప్పుడు ఎనిమిది నెలల తర్వాత తన నిర్ణయాన్ని మార్చుకుని ఈ బ్లాక్‌బస్టర్ మూవీని ఓటీటీ ప్లాట్‌ఫామ్‌పై రిలీజ్ చేయడానికి రెడీ అయ్యాడు.

సోమవారం (మార్చి 9) నాడు ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను సొంతం చేసుకున్న ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ 'సోనీ లివ్' (Sony LIV) ఒక అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చింది. గతేడాది (2025) జూన్‌లో థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ.. సుమారు ఎనిమిది నెలల తర్వాత ఇప...