OTT Movie: ఓటీటీలోకి రెండున్నరేళ్ల తర్వాత వస్తున్న స్పోర్ట్స్ డ్రామా.. 9.2 రేటింగ్.. బాక్సింగ్ రింగులో యుద్ధం
భారతదేశం, సెప్టెంబర్ 24 -- OTT Movie: థియేటర్లలో విమర్శకుల ప్రశంసలు అందుకొని ఐఎమ్డీబీ (IMDb)లో ఏకంగా 9.2 అత్యుత్తమ రేటింగ్ సాధించిన హిందీ ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా 'మై లడేగా' (Main Ladega) ఎట్టకేలకు డిజిటల్ ఆడియెన్స్ ముందుకొస్తోంది.
యంగ్ హీరో ఆకాష్ ప్రతాప్ సింగ్ ప్రధాన పాత్రలో నటించి స్వయంగా కథ అందించిన ఈ మూవీ.. డిజిటల్ స్ట్రీమింగ్ పార్ట్నర్ గా ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ 'జియోహాట్స్టార్' (JioHotstar)ను లాక్ చేసుకుంది. సెప్టెంబర్ 30 నుంచి ఈ సినిమా ఓటీటీలో గ్రాండ్ గా స్ట్రీమింగ్ కానుంది.
ఇంట్లో తండ్రి పెట్టే గృహహింస, వేధింపుల మధ్య పెరిగిన ఒక సాధారణ కుర్రాడు తన ఆవేదనను, కోపాన్ని ఒక ఆయుధంగా ఎలా మార్చుకున్నాడనే ఇన్స్పిరేషనల్ పాయింట్ తో ఈ సినిమా తెరకెక్కింది. తల్లే లోకంగా భావించే ఆ కుర్రాడిని కుటుంబానికి దూరంగా ఒక ఆర్మీ హాస్టల్ కి పంపిస్తారు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.