భారతదేశం, మార్చి 24 -- ఇండియాలో గత వారం రోజుల్లో ఓటీటీలో జనాలు దేనికి ఎక్కువ టైమ్ స్పెండ్ చేశారో, వేటికి రికార్డ్ స్థాయిలో వ్యూస్ వచ్చాయో చెబుతూ ఆర్మాక్స్ స్ట్రీమ్‌వ్యూ ఒక క్లియర్ రిపోర్ట్ ఇచ్చేసింది. మార్చి 16 నుంచి 22 వరకు ఇండియాలో అత్యధికంగా చూసిన టాప్ 10 ఓటీటీ కంటెంట్ వివరాలను ఆర్మాక్స్ మీడియా తాజాగా రిలీజ్ చేసింది. ఇందులో సినిమాలు, వెబ్ సిరీస్‌లు, పాపులర్ టీవీ షోలు అన్నీ ఉన్నాయి. ఈ వారం లిస్ట్‌ను ఒకసారి గమనిస్తే.. జియో హాట్‌స్టార్ ప్లాట్‌ఫామ్ ఏకంగా ఐదు షోలతో టాప్ 10 లిస్ట్‌ను పూర్తిగా డామినేట్ చేసింది.

మొదటి స్థానం: జియోహాట్‌స్టార్‌లో స్ట్రీమ్ అవుతున్న 'ది 50' షో ఏకంగా 8.8 మిలియన్ల వ్యూస్ తెచ్చుకుని, మిగతా వాటికి అందనంత ఎత్తులో నెంబర్ వన్ ప్లేస్‌లో నిలిచి దుమ్ములేపింది.

రెండో స్థానం: జియో హాట్‌స్టార్‌కే చెందిన పాపులర్ సిరీస్ 'నాగిన...