భారతదేశం, అక్టోబర్ 7 -- OTT Malayalam Thriller: మలయాళ విలక్షణ నటి ఊర్వశి (Urvashi) లీడ్ రోల్‌లో నటించిన మైండ్ బెండింగ్ మలయాళం సైకలాజికల్ డార్క్ థ్రిల్లర్ 'ఆశ' (Aasha) ఓటీటీ డిజిటల్ స్ట్రీమింగ్‌కు అధికారికంగా డేట్ లాక్ చేసుకుంది. థియేటర్లలో తన డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ప్రశంసలు అందుకున్న ఈ సినిమా.. అక్టోబర్ 16 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జీ5 (ZEE5) వేదికగా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది.

థియేటర్లలో సెప్టెంబర్ 11న విడుదలైన ఈ ప్రయోగాత్మక చిత్రాన్ని కొత్త దర్శకుడు సఫర్ సనాల్ (Safar Sanal) అత్యంత ఉత్కంఠభరితంగా తెరకెక్కించారు. జీ5 ఓటీటీ సంస్థ ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను సొంతం చేసుకోగా.. అక్టోబర్ 16 నుంచి డిజిటల్ ప్రీమియర్ ప్రారంభం కానుంది.

సౌత్ డిజిటల్ ఆడియన్స్ కోసం కేవలం మలయాళంలోనే కాకుండా తెలుగు, తమిళం, కన్నడ భాషల డబ్బింగ్ వర్షన్లను ఒక...