భారతదేశం, సెప్టెంబర్ 11 -- OTT Malayalam Releases: ఈ వారం ఓటీటీ స్పేస్‌లో మలయాళ సినిమాల హవా నడుస్తోంది. యాక్షన్, సైబర్ క్రైమ్ థ్రిల్లర్, హారర్ కామెడీ, రూరల్ ఫాంటసీలతో పాటు డిఫరెంట్ కాన్సెప్ట్ వెబ్ సిరీస్‌లు డిజిటల్ స్క్రీన్లను ముంచెత్తడానికి రెడీ అయ్యాయి. జీ5, అమెజాన్ ప్రైమ్ వీడియో, సన్ నెక్ట్స్, జియోహాట్‌స్టార్ లాంటి ప్రముఖ ప్లాట్‌ఫామ్‌లలో విడుదలవుతున్న ఈ వీకెండ్ మలయాళం ఓటీటీ మూవీస్ పూర్తి వివరాలు ఇవే.

ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో మలయాళ చిత్రాలు ఎప్పుడూ ప్రత్యేకం. తక్కువ బడ్జెట్‌తో రియలిస్టిక్ డ్రామాలు ప్రెజెంట్ చేస్తూ కంటెంట్ లవర్స్‌ను ఆకట్టుకోవడంలో వీరు ముందుంటారు.

ప్రతివారం లాగే ఈ సెప్టెంబర్ రెండో వారంలోనూ దాదాపు అరడజనుకు పైగా క్రేజీ ప్రాజెక్ట్‌లు బాక్స్ ఆఫీస్ సందడి ముగించుకుని, నేరుగా లేదా డిజిటల్ ప్రీమియర్‌గా మన ముందుకు వచ్చేశాయి. ...