భారతదేశం, అక్టోబర్ 30 -- OTT Malayalam Crime Thriller: మలయాళ చిత్ర పరిశ్రమకు సస్పెన్స్, సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ చిత్రాలను రూపొందించడంలో ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. కథనంలో ఉత్కంఠను రేకెత్తిస్తూ, మైండ్-బెండింగ్ ట్విస్టులతో ప్రేక్షకులను కట్టిపడేసే సినిమాలు మాలీవుడ్ నుంచి నిరంతరం వస్తూనే ఉంటాయి. ఆ వరుసలోనే ఇటీవల థియేటర్లలోకి వచ్చి సైకలాజికల్ థ్రిల్లర్ ప్రియుల దృష్టిని ఆకర్షించిన సినిమా 'ది థర్డ్ మర్డర్' (The Third Murder).

అక్టోబర్ 2న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ ఇప్పుడు డిజిటల్ స్పేస్ లోకి అడుగుపెట్టేందుకు సిద్ధమైంది. ఓటీటీ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ సస్పెన్స్ థ్రిల్లర్ నవంబర్ 13 నుంచి మనోరమ మ్యాక్స్ ఓటీటీలోకి రానుంది. ప్రముఖ మలయాళ వర్సటైల్ నటులు సైజు కురుప్, ఇంద్రన్స్, వినయ్ ఫోర్ట్ ప్రధాన పాత్రల్లో దర్శకుడు సునీల్ ఇబ్రహీ...