భారతదేశం, ఫిబ్రవరి 17 -- భారతీయ చలనచిత్ర రంగంలో మలయాళ సినిమాలు ఇప్పుడు సరికొత్త ట్రెండ్‌ను సృష్టిస్తున్నాయి. చిన్న బడ్జెట్‌తో వచ్చి అద్భుతమైన కథాంశాలతో బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న కేరళ సినిమాలపై బాలీవుడ్ దిగ్గజ దర్శకుడు అనురాగ్ కశ్యప్ మరోసారి తన అభిమానాన్ని చాటుకున్నారు.

త్వరలో విడుదల కానున్న 'కెన్నెడీ' సినిమా ప్రచారంలో భాగంగా అనురాగ్ కశ్యప్ మాట్లాడుతూ 2025లో వచ్చిన మలయాళ హిట్ చిత్రాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్‌పై సెటైర్లు వేశారు.

మలయాళ చిత్రాల విజయం వెనుక ఉన్న రహస్యాన్ని అనురాగ్ కశ్యప్ వివరిస్తూ.. "కేరళ అత్యంత విద్యావంతులు, సినిమాను ప్రేమించే ప్రేక్షకులు ఉన్న రాష్ట్రం. అక్కడ ఫిలిం క్లబ్స్ ఉన్నాయి, సినిమా సంస్కృతి ఉంది. అన్నింటికంటే ముఖ్యంగా ఒక దర్శకుడికి మరో దర్శకుడు మద్దతుగా నిలుస్తారు" అని పేర్కొన్నారు.

రీసెంట్ హిట...