భారతదేశం, సెప్టెంబర్ 27 -- OTT Malayalam: మలయాళ సినీ చరిత్రలోనే రూ.320 కోట్లకు పైగా వసూలు చేసి ఆల్-టైమ్ రికార్డులు తిరగరాసిన రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ 'బెత్లెహేమ్ కుటుంబ యూనిట్' (Bethlehem Kudumba Unit). ఇప్పుడు ఈ మూవీ డిజిటల్ అరంగేట్రానికి ముహూర్తం ఖరారైంది.

నివిన్ పౌలీ, మమితా బైజు ప్రధాన పాత్రల్లో నటించిన రొమాంటిక్ డ్రామా 'బెత్లెహేమ్ కుటుంబ యూనిట్'. గిరీష్ ఏడీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం అక్టోబర్ 2 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ జియోహాట్‌స్టార్ (JioHotstar) లో స్ట్రీమింగ్ కానుంది.

థియేటర్లలో రికార్డుల మోత మోగించిన ఈ బ్లాక్‌బస్టర్ మూవీ ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చేసింది.

భావనా స్టూడియోస్ బ్యానర్‌పై ఫహద్ ఫాజిల్, దిలీష్ పోతన్, శ్యామ్ పుష్కరన్ సంయుక్తంగా నిర్మించిన 'బెత్లె...