భారతదేశం, జూన్ 12 -- Today OTT Horror Thriller Movies Release: థియేటర్లలో కంటే ఓటీటీ వేదికలపై హారర్, సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాలకు క్రేజ్ ఎక్కువగా ఉంటోంది. చీకటి పడ్డాక రూమ్ లైట్లన్నీ ఆపేసి, స్క్రీన్ ముందు కూర్చుని భయపడుతూ సినిమాలు చూడటం డిజిటల్ ఆడియన్స్‌కు ఒక అద్భుతమైన అనుభూతిని ఇస్తుంది.

సరిగ్గా ఇదే వినోదాన్ని రెట్టింపు చేయడానికి ప్రముఖ ఓటీటీ సంస్థలైన నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ సరికొత్త ఓటీటీ హారర్ థ్రిల్లర్ సినిమాలతో ఇవాళ (జూన్ 12) ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. నేటి నుంచి ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్న మూడు విభిన్నమైన హారర్ సినిమాల విశేషాలు, కథాంశాలు, చూసేందుకు ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఏంటీ అనేవాటిపై ఒక లుక్కేద్దాం.

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్, ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్ కాంబినేషన్‌లో దాదాపు రెండు దశాబ్దాల తర్వాత వచ్చిన క్రేజీ హ...