భారతదేశం, మే 20 -- OTT Horror Thriller: హారర్, సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులకు ఒక క్రేజీ అప్‌డేట్. దర్శకుడు మణికంఠన్ రామలింగం తెరకెక్కించిన సరికొత్త తమిళ హారర్ థ్రిల్లర్ మూవీ 'సాతాన్: ది డార్క్'. ఆకట్టుకునే కథా నేపథ్యంతో రూపొందిన ఈ సినిమా థియేటర్లలో విడుదలైన తర్వాత మంచి అటెన్షన్ తెచ్చుకుంది.

ఇప్పుడు ఈ మూవీ డిజిటల్ లవర్స్‌ను అలరించేందుకు ఓటీటీ వేదికగా అందుబాటులోకి వచ్చింది. ఈ సినిమాను ఆహా తమిళంతో పాటు అమెజాన్ ప్రైమ్ వీడియోలోనూ చూడవచ్చు. థియేటర్లలో ఈ మిస్టరీ థ్రిల్లర్‌ను మిస్ అయిన వారికి ఇది ఒక మంచి అవకాశం.

హారర్ థ్రిల్లర్ మూవీ అయిన 'సాతాన్: ది డార్క్' కథాంశం చాలా విభిన్నంగా ఉంటుంది. ఈ కథ రెండు వేర్వేరు కాలాల (Two Timelines) నేపథ్యంలో సాగుతుంది. ఒక భయంకరమైన క్షుద్ర పూజ, చేతబడి, దాని చుట్టూ ఉన్న అతీతమైన శాపం ఆధారంగా దర్శ...