భారతదేశం, సెప్టెంబర్ 19 -- OTT Horror Thriller: బుల్లితెరపై నటుడిగా మెప్పించిన అభినయ కృష్ణ (అదిరే అభి) దర్శకత్వంలో తెరకెక్కిన సైకోలాజికల్ సూపర్ నేచురల్ హారర్ క్రైమ్ థ్రిల్లర్ 'కర్మాఖ్య' (Karmakhya / Kamakhya). ఈ మూవీ ఇప్పుడు సడెన్ గా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పైకి అడుగుపెట్టింది. గుండె ధైర్యం ఉన్నవాళ్లే ఈ మూవీ చూడాలనే టాక్ వినిపిస్తోంది.

థియేటర్లలో 'A' (అడల్ట్) సర్టిఫికేట్‌తో విడుదలై సస్పెన్స్‌తో భయపెట్టింది కర్మాఖ్య సినిమా. ఈ మూవీ ఇప్పుడు ప్రముఖ ఓటీటీ సంస్థ జియోహాట్‌స్టార్ (JioHotstar) లో తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో అందుబాటులోకి వచ్చింది. సమైరా, శరణ్య ప్రదీప్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ హారర్ థ్రిల్లర్ మూవీ సడెన్ గా ఓటీటీలో రిలీజైంది.

ఇరవై సంవత్సరాల క్రితం చేతబడి చేస్తున్నారనే ఆరోపణలతో ఒక గ్రామం అంతా ఏకమై దంపతులను బతికుం...