భారతదేశం, సెప్టెంబర్ 8 -- OTT Horror Thriller: భూతాలు, దెయ్యాలు, భయంకరమైన బంగ్లాలు ఏమీ లేకుండానే మీ గుండెల్లో రైళ్లు పరిగెత్తించే సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ 'గెట్ అవుట్' (Get Out) ప్రస్తుతం జియోహాట్‌స్టార్‌లో సంచలనం సృష్టిస్తోంది. 7.9 ఐఎమ్‌డీబీ (IMDb) రేటింగ్‌తో ఓటీటీ లవర్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటున్న ఈ గ్లోబల్ క్లాసిక్ మూవీని స్టార్ డైరెక్టర్ జార్డన్ పీల్ తెరకెక్కించారు.

కేవలం 4.5 మిలియన్ డాలర్ల (దాదాపు రూ. 45 కోట్లు) అత్యల్ప బడ్జెట్‌తో రూపుదిద్దుకున్న ఈ సినిమా.. వరల్డ్‌వైడ్‌గా థియేటర్లలో రూ. 2500 కోట్లకు పైగా ($259.9M) గ్రాస్ వసూళ్లు సాధించి సంచలనం సృష్టించింది. హాలీవుడ్ బాక్స్ ఆఫీస్ చరిత్రలోనే అత్యంత ఎక్కువ ప్రాఫిట్ మార్జిన్ సాధించిన హారర్ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది.

సాధారణంగా హారర్ జానర్ సినిమాలకు ఆస్కార్ లాంటి ప్రతిష్టాత్మక అవార్...