భారతదేశం, అక్టోబర్ 7 -- OTT Psychological Horror Thriller Phobia On 4 Platforms: డిజిటల్ వినోద ప్రపంచంలో క్రైమ్, కామెడీ, యాక్షన్ చిత్రాలకు ఎంత క్రేజ్ ఉందో.. హార్ట్ బీట్ పెంచే సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ సినిమాలకు కూడా అంతే ఆదరణ లభిస్తోంది. థ్రిల్లర్ అభిమానులను ప్రతి సన్నివేశంలోనూ భయపెడుతూ, నరనరాల్లోనూ ఉత్కంఠ రేకెత్తించే సినిమాలు ఓటీటీలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.

అలాంటి జాబితాలోనే అగ్రస్థానంలో నిలుస్తుంది లెజెండ్ హీరోయిన్ రాధికా ఆప్టే నటించిన మైండ్ బ్లోయింగ్ మూవీ 'ఫోబియా'. భయాన్ని, మానసిక సంఘర్షణను తెరపై ఆవిష్కరించిన ఈ చిత్రం థ్రిల్లర్ ఓటీటీ ప్రేమికులకు ఒక ఊహించని అనుభూతిని ఇస్తుంది.

మహెక్ (రాధికా ఆప్టే) ఒక ప్రతిభావంతమైన ఆర్టిస్ట్. ఒకరోజు రాత్రి పార్టీ నుంచి ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో ఆమె ప్రయాణిస్తున్న టాక్సీ డ్రైవర్ మహెక్‌పై ...