భారతదేశం, ఆగస్టు 23 -- Not All Movies Are The Same Dual OTT Release: ఓటీటీ ప్రపంచంలో ప్రతివారం వందల సినిమాలు అందుబాటులోకి వస్తుంటాయి. అయితే సస్పెన్స్, థ్రిల్లర్, హారర్ జోనర్లను ఇష్టపడే ప్రేక్షకులను మెప్పించే సినిమాలు కొన్నే ఉంటాయి. కొన్ని సినిమాలు చూస్తున్నంతసేపు క్షణక్షణం ఉత్కంఠ రేపుతూ రొమాలు నిక్కబొడుచుకునేలా చేస్తాయి.

సరిగ్గా అలాంటి అరుదైన అనుభూతినే ఇస్తోంది 'నాట్ ఆల్ మూవీస్ ఆర్ ది సేమ్: డ్యూయల్' (Not All Movies Are The Same : Duel) అనే సినిమా. సస్పెన్స్, హారర్ కలయికతో రూపొందిన ఈ చిత్రం ఓటీటీలో స్ట్రీమ్ అవుతూ విశేష ఆదరణ పొందుతోంది.

డ్యూయల్ సినిమాలో ప్రధానంగా రెండు వేర్వేరు కథలను చూపించారు. మొదటి కథలో ఒక వ్యక్తి తన సర్వస్వాన్నీ కోల్పోయి, ప్రమాదకరమైన జాంబీల (Zombies) మధ్య చిక్కుకుంటాడు. ఆ భయానక వాతావరణం నుంచి ప్రాణాలతో ఎలా బయటపడ్డాడు? ...