భారతదేశం, ఏప్రిల్ 14 -- The Bride OTT Streaming: 1935 నాటి 'బ్రైడ్ ఆఫ్ ఫ్రాంకెన్‌స్టైన్' ఆధారంగా తెరకెక్కిన చిత్రమే ది బ్రైడ్. 1930ల కాలం నాటి అమెరికా నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. మేరీ షెల్లీ (జె జెస్సీ బక్లీ) తాను రాసిన నవల పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తూ, తాను నిజంగా రాయాలనుకున్న ఒక లేడి ఒరియెంటెడ్ కథను మనకు పరిచయం చేయడంతో ఈ సినిమా మొదలవుతుంది.

ఇక్కడే దర్శకురాలు ఒక కొత్త ప్రయోగానికి తెరలేపారు. ఐడా అనే మహిళ మరణించిన తర్వాత, ఒంటరితనంతో బాధపడుతున్న ఫ్రాంకెన్‌స్టైన్ మాన్‌స్టర్ (క్రిస్టియన్ బేల్) అభ్యర్థన మేరకు ఒక డాక్టర్ ఆమెకు మళ్లీ ప్రాణం పోస్తుంది. చనిపోయిన ఐడాను బతికించేందుకు ప్రయోగం చేస్తారు. అంటే ప్రయోగంతో పునర్జన్మ ప్రసాదిస్తారు. అయితే, ఆ ప్రయోగం వికటిస్తుంది.

పునర్జన్మ పొందిన ఐడాకు గతమేమీ గుర్తుండదు. ఆమెను తన భర్తగా ఫ్రాంకెన్‌స్టైన్...