భారతదేశం, జూలై 11 -- OTT Horror Thriller The Call Release: వారంతం వచ్చిందంటే చాలు ఓటీటీ ప్రియులు సరికొత్త సినిమాల కోసం డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లను జల్లెడ పడుతుంటారు. ముఖ్యంగా హారర్, సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్ చిత్రాలకు తెలుగు రాష్ట్రాల్లో ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. థియేటర్లలో మిస్ అయిన విదేశీ భయానక చిత్రాలను ఓటీటీల్లో చూసేందుకు ప్రేక్షకులు ఎప్పుడూ ఆసక్తి చూపిస్తారు.

అలాంటి వారి కోసమే ఓ సూపర్ హిట్ హారర్ థ్రిల్లర్ మూవీ 3 ఓటీటీల్లోకి వచ్చేసింది. ఇదివరకే రెండింట్లో స్ట్రీమింగ్ అవుతోన్న ఆ సినిమా తాజాగా నిన్న (జూలై 10) ఓటీటీలోకి వచ్చేసింది. ఆ సినిమానే ది కాల్. సౌత్ కొరియన్ సైన్స్ ఫిక్షన్, సైకలాజికల్, హారర్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ది కాల్ హాలీవుడ్‌లో మంచి విజయం సాధించింది.

ది కాల్ సినిమా 2020లో అక్టోబర్ 2న థియేటర్లలో విడుదల అయింది. థియేట్రికల్ రిల...