భారతదేశం, జూలై 15 -- OTT Horror: తెలుగు డిజిటల్ ఆడియన్స్‌లో ఈ మధ్య కాలంలో హాలీవుడ్ హారర్ థ్రిల్లర్లకు డిమాండ్ విపరీతంగా పెరిగింది. ఒరిజినల్ జోనర్‌ను ఎంజాయ్ చేసే ఆడియన్స్ కోసం ఓటీటీ సంస్థలు క్రేజీ ప్రాజెక్ట్స్‌ను రంగంలోకి దించుతున్నాయి. ఇప్పుడు అలాంటి 'రెడీ ఆర్ నాట్ 2: హియర్ ఐ కమ్' ఓటీటీలోకి రాబోతుంది.

బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ గా నిలిచిన హారర్ థ్రిల్లర్ 'రెడీ ఆర్ నాట్ 2' ఓటీటీ రిలీజ్ కు సమయం దగ్గర పడుతోంది. ఈ మూవీ మరికొన్ని గంటల్లో స్ట్రీమింగ్ కానుంది. జూలై 16 నుంచి పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ జియోహాట్‌స్టార్ లోకి రాబోతుంది ఈ సినిమా.

2019లో వచ్చిన కల్ట్ హిట్ హారర్ చిత్రం 'రెడీ ఆర్ నాట్'కు ఈ 'రెడీ ఆర్ నాట్ 2' అనేది డైరెక్ట్ సీక్వెల్. మొదటి భాగంలో లె డోమాస్ ఫ్యామిలీ చేసిన ప్రాణాంతక సాంప్రదాయ వేట నుంచి గ్రేస్ (సమరా వీవింగ్) ఎలాగోలా బతిక...