భారతదేశం, ఆగస్టు 22 -- OTT Horror: హర్రర్, మైండ్-బెండింగ్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే ఓటీటీ లవర్స్ కోసం ఒక డిఫరెంట్ మూవీ వచ్చేసింది. ఎక్కడా ఎడిటింగ్ కట్స్ లేకుండా, ఒకే కంటిన్యూయస్ టేక్ (వన్-షాట్)తో రూపొందిన సైకాలాజికల్ హారర్ థ్రిల్లర్ 'బరీ ది డెవిల్' ఓటీటీలో అడుగుపెట్టింది.

ఈ బరీ ది డెవిల్ మూవీ డైరెక్ట్ ఓటీటీలో రిలీజైంది. ఈ మూవీ కథ జూలియా అనే ఒక హాస్పిస్ నర్స్ (తీవ్ర అనారోగ్యంతో బాధపడేవారిని చూసుకునే నర్స్) చుట్టూ తిరుగుతుంది. తీవ్రమైన డిమెన్షియా (మతిమరుపు) వ్యాధితో బాధపడుతున్న ఈవ్లిన్ అనే వృద్ధురాలికి సేవలు అందించడానికి జూలియా ఆమె నివాసానికి వెళుతుంది.

ఆ ఇల్లు నగరానికి దూరంగా, చీకటిగా, ఒంటరిగా ఉంటుంది. రాత్రి సమయం గడిచేకొద్దీ ఈవ్లిన్ ప్రవర్తనలో విపరీతమైన, భయంకరమైన మార్పులు మొదలవుతాయి. మొదట్లో అది వయోభారం, డిమెన్షియా వల్ల వచ్చ...