భారతదేశం, జూలై 29 -- OTT Horror: ఇటీవలి కాలంలో భారతీయ ఓటీటీ వీక్షకులు, ముఖ్యంగా తెలుగు ఆడియన్స్ కొరియన్ మైండ్-బెండింగ్ థ్రిల్లర్లు, హారర్ సినిమాలపై విపరీతమైన ఆసక్తి చూపిస్తున్నారు. తాజాగా అలాంటి ఓ వణికించే కొరియన్ హారర్ థ్రిల్లర్ తెలుగులోనూ ఓటీటీలోకి వచ్చేసింది. ఆ సినిమానే 'ఘోస్ట్ ట్రైన్'.

కేవలం దెయ్యాల ముఖాలు చూపించడమే కాకుండా విభిన్నమైన అట్మాస్ఫియర్, సైకాలాజికల్ గ్రిప్, గూస్‌బంప్స్ తెప్పించే సౌండ్ డిజైనింగ్‌తో భయపెట్టడం కొరియన్ చిత్రాల ప్రత్యేకత. ఈ హారర్ థ్రిల్లర్ ఘోస్ట్ ట్రైన్ కూడా అలాంటిదే. ఈ సినిమా తాజాగా ప్రముఖ డిజిటల్ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) లోకి వచ్చేసింది. ఒరిజినల్ కొరియన్ భాషతో పాటు తెలుగు, తమిళం, హిందీ భాషల్లో కూడా ఈ చిత్రం అందుబాటులోకి వచ్చింది.

పాపులారిటీ, వ్యూస్ కోసం ఏమైనా చేసే దా-క్యుంగ్ (జూ హ్యూన...