భారతదేశం, జూలై 16 -- OTT Horror: తెలుగు చిత్రసీమలో డిజిటల్ మార్కెట్ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. థియేటర్లలో కలెక్షన్లు రాబట్టలేకపోయిన చిన్న, మధ్య తరహా చిత్రాలు ఓటీటీ వేదికగా సెకండ్ ఇన్నింగ్స్‌లో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. అలాంటి తెలుగు హారర్ థ్రిల్లర్ 'ఈషా' ఇప్పుడు మరో ఓటీటీలోకి వచ్చేసింది.

శ్రీనివాస్ మన్నె దర్శకత్వంలో వచ్చిన 'ఈషా' సినిమా గత ఏడాది డిసెంబర్ 2025లో థియేటర్లలో విడుదలై బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. అయితే, డిజిటల్ విండోలో మాత్రం ఈ హారర్ థ్రిల్లర్ సినిమా లైఫ్‌టైమ్ వాల్యూను మేకర్స్ అద్భుతంగా క్యాష్ చేసుకుంటున్నారు. ఓటీటీలో ఈ సినిమా సత్తాచాటుతోంది. ఇప్పుడు రెండు ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతోంది.

మొదట ఈషా చిత్రం ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైంది. అక్కడ ఓవర్సీస్ ఆడియన్స్‌తో పాటు ఇండ...