భారతదేశం, ఆగస్టు 13 -- OTT Horror: ఓటీటీ ప్రియులకు ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫామ్ 'జీ5' (ZEE5) మైండ్ బ్లాకింగ్ ఆఫర్ అనౌన్స్ చేసింది. వెన్నులో వణుకు పుట్టేలా భయపెట్టే మూడు సాలిడ్ తెలుగు హారర్ థ్రిల్లర్స్ ను రూపాయి ఖర్చు లేకుండా పూర్తి ఉచితంగా ఆడియన్స్ ముందుకు తీసుకొచ్చింది. సౌందర్య 'చంద్రముఖి', కార్తి 'కాష్మోరా'తో పాటు క్లాసిక్ హారర్ డ్రామా 'తులసీదళం' సినిమాలను ఫ్రీగా స్ట్రీమింగ్ చేస్తూ హర్రర్ లవర్స్ కు బిగ్ సర్ ప్రైజ్ ఇచ్చింది.

ధైర్యం ఉంటే ఈ మూడు సినిమాలు ఒంటరిగా చూడండి అనే క్యాప్షన్ తో జీ5 ఓటీటీ తన ఎక్స్ లో ట్వీట్ చేసింది. వీటిలో దివంగత నటి సౌందర్య ఐకానిక్ పర్ఫార్మెన్స్ తో వచ్చిన 'చంద్రముఖి' (ఆప్తమిత్ర) హారర్ జానర్ లోనే బిగ్గెస్ట్ క్లాసిక్. స్ప్లిట్ పర్సనాలిటీ, దెయ్యం పట్టిన మానసిక పరిస్థితిని సౌందర్య స్క్రీన్ పై పండించిన తీరు ఇప్పటికీ ఆడియ...