భారతదేశం, ఏప్రిల్ 21 -- Vishwak Sen Liked From 4 OTT Streaming: మనుషులు వెళ్లగలరు కానీ తిరిగి రాలేని ఒక మాయా నగరం.. అక్కడ రాత్రిపూట తిరిగే రాక్షస రూపాలు.. చీకటి పడితే అంతే సంగతి. ఈ నేపథ్యంలో సాగే 'ఫ్రమ్' సిరీస్ ఇప్పటికే మూడు సీజన్లను దిగ్విజయంగా పూర్తి చేసుకుంది. తాజాగా విడుదలైన నాలుగో సీజన్ మొదటి ఎపిసోడ్‌తోనే ప్రేక్షకుల్లో ఆసక్తిని రెట్టింపు చేసింది.

గత సీజన్ ముగింపులో మిగిలిపోయిన అనేక ప్రశ్నలకు ఈసారి సమాధానాలు దొరుకుతాయని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ముఖ్యంగా ఆ 'ఎల్లో డ్రెస్ వ్యక్తి' (Man in Yellow) అసలు కథ ఏంటనేది ఫ్రమ్ సీజన్ 4లో ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. మరి ఈ సీజన్‌లో అయినా ఆ ఊరు మిస్టరీ వీడుతుందేమో చూడాలి.

వింతైన ఊరు, రాత్రి తిరిగే వింత జీవులు, అవి చేసే భయానక సంఘటనలతో తెరకెక్కిన ఫ్రమ్ వెబ్ సిరీస్‌కు వరల్డ్ వైడ్‌గా ఫ్యాన్స్ ఉన్నారు. వ...