భారతదేశం, ఫిబ్రవరి 13 -- ప్రపంచవ్యాప్తంగా హారర్ సినిమాలకు ఉండే క్రేజే వేరు. ముఖ్యంగా హాలీవుడ్ సూపర్ హిట్ హారర్ థ్రిల్లర్‌లోని 'ది కంజురింగ్' యూనివర్స్ అంటే ప్రేక్షకుల్లో ఒక రకమైన భయం, ఆసక్తి కలగలిసి ఉంటాయి.

వరల్డ్ వైడ్‌గా అంతలా ప్రజాదరణ పొందిన హారర్ ఫ్రాంచైజీ 'ది కంజురింగ్' సిరీస్‌లో చివరిదైన ది కంజురింగ్: లాస్ట్ రైట్స్ ఓటీటీలోకి ఇవాళ (ఫిబ్రవరి 13) వచ్చేసింది. గతేడాది సెప్టెంబర్ 5న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టించింది.

కేవలం 55 మిలియన్ల డాలర్ల (సుమారు రూ. 460 కోట్లు) బడ్జెట్‌తో తెరకెక్కిన లాస్ట్ రైట్స్ ప్రపంచవ్యాప్తంగా 499 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 4,200 కోట్లు) కలెక్షన్స్ రాబట్టి సత్తా చాటింది. హారర్ సినిమాల చరిత్రలోనే అత్యంత భారీ వసూళ్లు రాబట్టిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది ది కంజూరింగ్ లాస్ట్ రైట్స్.

అంత...