భారతదేశం, ఏప్రిల్ 24 -- OTT Horror Thriller Release Today: కొరియన్ డ్రామాలకు (K-Dramas) తెలుగు రాష్ట్రాల్లో కూడా విపరీతమైన క్రేజ్ ఉంది. ముఖ్యంగా థ్రిల్లర్, హారర్ జోనర్లను మన ఓటీటీ ఆడియెన్స్ బాగా ఆదరిస్తారు. సరిగ్గా ఇదే పల్స్‌ను పట్టుకుంటూ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ మంచి కె డ్రామా హారర్ థ్రిల్లర్స్‌ను వదులుతున్నాయి.

తాజాగా ఓటీటీలోకి మొట్టమొదటి కొరియన్ యంగ్ అడల్ట్ సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ సిరీస్‌గా 'ఇఫ్ విషెస్ కుడ్ కిల్' వచ్చేసింది. ఇది కేవలం దెయ్యాల కథ కాదు. సాంకేతికతకు భయంకరమైన మానవాతీత శక్తులు తోడైతే పరిస్థితి ఎలా ఉంటుందో చూపించే ఒక సైకలాజికల్ హారర్ థ్రిల్లర్. ఈ సిరీస్‌లో హారర్, మిస్టరీ, సైకలాజికల్ అంశాలతో పాటు ఒళ్లు గగుర్పొడిచే సీన్స్ ఉన్నాయి.

ఇఫ్ విషెస్ కుడ్ కిల్ కథ విషయానికి వస్తే.. సీరిన్ అనే హైస్కూల్‌లో చదివే కొందరు విద్యార్థులకు 'గిరి...