భారతదేశం, అక్టోబర్ 1 -- OTT Friday Releases: ఈ వీకెండ్ కోసం వెయిట్ చేస్తున్న ఓటీటీ లవర్స్‌కి మైండ్ బ్లాకింగ్ న్యూస్ వచ్చేసింది. ఈ శుక్రవారం అంటే అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజు నెట్‌ఫ్లిక్స్, జియోహాట్‌స్టార్, జీ5 ప్లాట్‌ఫామ్‌లలో ఏకంగా 6 కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్ కావడానికి రెడీ అయిపోయాయి. రొమాంటిక్ కామెడీల నుంచి గూస్‌బంప్స్ తెప్పించే క్రైమ్ థ్రిల్లర్లు, స్పోర్ట్స్ డాక్యుమెంటరీల వరకు ప్రతీ ఒక్కరి టేస్ట్‌కి తగ్గ కంటెంట్ అందుబాటులోకి వస్తోంది.

'ప్రేమలు' సినిమాతో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన గిరీష్ ఏడీ దర్శకత్వంలో వచ్చిన మలయాళ రొమాంటిక్ కామెడీ ఇది. 13 ఏళ్ల వయసు వ్యత్యాసం ఉన్న యాష్లే, జస్టిన్ అనే జంట ప్రేమకథ, వారి పెళ్లికి ఇంట్లో వాళ్లు పెట్టే ఆటంకాల చుట్టూ కథ తిరుగుతుంది.

ఐఎండీబీలో 8.3 రేటింగ్ ఉన్న ఈ మూవీ రన్ టైమ్ 2 గంటల 37 నిమిషాలు...