భారతదేశం, అక్టోబర్ 29 -- OTT Friday Releases: ఓటీటీ ఆడియెన్స్ కు ఈ వీకెండ్ పండగలా మారనుంది. ఒకే రోజు 7 సరికొత్త మూవీస్, వెబ్ సిరీస్ రానుండగా.. అవన్నీ తెలుగులోనూ అందుబాటులో ఉండనుండటం విశేషం. ప్రేక్షకులకు విభిన్న రకాల జానర్‌లలో కంటెంట్ అందించేందుకు నెట్‌ఫ్లిక్స్, జీ5, ఆహా, ప్రైమ్ వీడియోలు సరికొత్త సినిమాలు, సిరీస్ లను సిద్ధం చేశాయి.

ఆకట్టుకునే సస్పెన్స్ థ్రిల్లర్స్, యాక్షన్ డ్రామాలు, రొమాంటిక్ సిరీస్‌లతో కూడిన ఈ సినిమాలు, సిరీస్ కథాంశాలు, ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ల పూర్తి వివరాలు మీకోసం. మొత్తంగా 7 క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి.

హై-వోల్టేజ్ సస్పెన్స్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన 'సిగ్మా' (Sigma) ఈ రాత్రి నుంచి ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి వచ్చింది. తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీతో సహా 5 పాన్-ఇండియా భాషలలో ఈ సినిమా ...