భారతదేశం, సెప్టెంబర్ 23 -- OTT Friday: ఈ శుక్రవారం అంటే సెప్టెంబర్ 25న సౌత్ సినిమా బాక్సాఫీస్ దగ్గరే కాదు.. డిజిటల్ స్పేస్‌లోనూ విరుచుకుపడబోతోంది. థియేటర్లలో ఏకంగా 6 సినిమాలు సందడి చేయడానికి వస్తుంటే.. డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లో 4 డిఫరెంట్ జానర్ సినిమాలు ఒకే రోజు స్ట్రీమింగ్ కాబోతున్నాయి. వీకెండ్ లో ఇంటి దగ్గరే ఉండి ఎంజాయ్ చేయాలనుకునే మూవీ లవర్స్ కోసం ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ సరికొత్త వినోదాన్ని పంచడానికి సిద్ధమయ్యాయి.

ఈ వారం జీ5, సన్‌నెక్స్ట్, సోనీలివ్, జియోహాట్‌స్టార్‌లలో స్ట్రీమింగ్ అవుతున్న ఆ 4 క్రేజీ సౌత్ సినిమాల వివరాలు, వాటి ఆసక్తికరమైన కథాంశాలు ఏంటో ఇప్పుడు డీటైల్డ్‌గా చూద్దాం.

టాలీవుడ్‌లో ఒకప్పుడు బ్లాక్‌బస్టర్ ప్రొడ్యూసర్‌గా, ఆ తర్వాత డిఫరెంట్ మూవీస్ తీసే డైరెక్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఎంఎస్ రాజు దర్శకత్వంలో తెరకెక్కిన సరికొత్త స...