భారతదేశం, నవంబర్ 8 -- OTT Crime Thriller Series To Watch Today Diwali: పండుగ సెలవుల్లో కుటుంబంతో కలిసి హాయిగా గడపడం ప్రతి ఒక్కరికీ ప్రత్యేకమైన అనుభూతి. థియేటర్ల రద్దీ, బయటి హడావుడి లేకుండా ఇంట్లోనే కూర్చుని సరికొత్త సినిమా వినోదాన్ని ఆస్వాదించాలనుకునే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది.

తెలుగు ప్రేక్షకుల్లో కూడా సస్పెన్స్, ఊహించని ట్విస్టులు ఉండే క్రైమ్ థ్రిల్లర్ సిరీస్‌లకు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో విపరీతమైన ఆదరణ లభిస్తోంది. ఇవాళ (నవంబర్ 8) దీపావళి పండుగ రోజు మిమ్మల్ని సీటు అంచున కూర్చోబెట్టే, అత్యంత ఉత్కంఠభరితమైన ఐదు క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్‌ల వివరాలు చూద్దాం.

నేర ప్రపంచపు చీకటి కోణాలను ఆవిష్కరించే కథలతో వచ్చినా 'పాతాళ్ లోక్' ఓటీటీ ప్రియులను అమితంగా ఆకట్టుకుంది. పోలీస్ ఇన్ స్పెక్టర్ హాథీరామ్ చౌదరి పాత్రలో జైదీప్ అహ్లావత్ నటించిన ఈ ఓటీట...