భారతదేశం, అక్టోబర్ 24 -- OTT Crime Thrillers: ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో విలక్షణ నటనకు, సస్పెన్స్ థ్రిల్లర్లకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే నటుడు మనోజ్ బాజ్‌పాయ్ (Manoj Bajpayee). ఈ వర్సటైల్ నటుడు లీడ్ రీల్లో, దర్శకుడు రితేష్ షా తెరకెక్కించిన లేటెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ 'గజబ్ రాత్' (Gajab Raat). అక్టోబర్ 23న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలై ఈ సినిమా వీక్షకుల నుంచి మంచి ఆదరణ పొందుతోంది.

సస్పెన్స్, డార్క్ కామెడీ, పోలీస్ ఇన్వెస్టిగేషన్ మేళవింపుగా సాగే 'గజబ్ రాత్' చూసేసిన తర్వాత.. అదే తరహాలో మైండ్ బ్లోయింగ్ థ్రిల్, సీట్-ఎడ్జ్ అనుభూతిని కలిగించే మనోజ్ బాజ్‌పాయ్ బెస్ట్ క్రైమ్ థ్రిల్లర్లను చూడాలనుకుంటే, ఓటీటీలో అందుబాటులో ఉన్న ఈ 6 సినిమాలు, వెబ్ సిరీస్ మీ వాచ్‌లిస్ట్‌లో ఖచ్చితంగా చేర్చుకోవాల్సిందే. 'ది ఫ్యామిలీ మ్యాన్', 'సిర్ఫ్ ఏక్ బందా కాఫీ హై' నుంచి 'కిల్లర...