భారతదేశం, ఆగస్టు 17 -- OTT Crime Thriller: మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్, నేషనల్ అవార్డ్ విన్నింగ్ నటి పార్వతి తిరువోతు కాంబినేషన్లో వచ్చిన మైండ్ బ్లోయింగ్ హైస్ట్ క్రైమ్ థ్రిల్లర్ 'ఐ, నోబడీ' (I, Nobody) డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ఎట్టకేలకు అఫీషియల్‌గా కన్ఫమ్ అయింది. థియేటర్లలో రిలీజైన నెల రోజుల తర్వాత ఈ పవర్‌ప్యాక్డ్ సోషల్ థ్రిల్లర్ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జియోహాట్‌స్టార్ వేదికగా ఆగస్టు 25 నుంచి ఆడియన్స్ ముందుకు రాబోతోంది.

సౌత్ ఇండియా వ్యాప్తంగా ఉన్న సినిమా లవర్స్ కోసం జియోహాట్‌స్టార్ ఈ మూవీని ఒరిజినల్ మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో కూడా అందుబాటులోకి తెస్తోంది. "ఇకపై ఎవ్వరూ ఈ క్రేజీ థ్రిల్లర్‌ని మిస్ కాకూడదు" అనే క్యాప్షన్‌తో జియోహాట్‌స్టార్ ఓటీటీ సోషల్ మీడియాలో అనౌన్స్‌మెంట్ పోస్ట్ షేర్ చేసింది.

ఈ సినిమా కథ అ...