భారతదేశం, సెప్టెంబర్ 30 -- OTT Crime Thriller: ఓటీటీలో క్రైమ్ థ్రిల్లర్లు చూసే అలవాటు ఉంటే మీకో మైండ్ బ్లాకింగ్ ఆప్షన్ చాలా రోజుల నుంచి అందుబాటులో ఉంది. 'ఫర్జీ' వెబ్ సిరీస్‌తో దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు భువన్ అరోరా (Bhuvan Arora) లీడ్ రోల్‌లో నటించిన డార్క్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ సిరీస్ 'జనావర్' (Janaavar) ప్రస్తుతం డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో తెగ హల్‌చల్ చేస్తోంది. ఓటీటీ జనాలు ఈ 7 ఎపిసోడ్ల సిరీస్‌ను తెగ బింజ్ వాచ్ చేస్తున్నారు.

సబ్-ఇన్‌స్పెక్టర్ హేమంత్ కుమార్ (భువన్ అరోరా) ఒక వారం పాటు హాయిగా సెలవుల్లోకి వెళ్లాలని ప్లాన్ చేసుకుంటాడు. సరిగ్గా అదే టైమ్‌లో ఊరిలో ఊహించని గందరగోళం మొదలవుతుంది. దాంతో ఆయన వెకేషన్ ప్లాన్ క్యాన్సిల్ అయిపోతుంది.

పై అధికారుల నుంచి హేమంత్‌కు రెండు పెద్ద కేసుల బాధ్యత అప్పగిస్తారు. ఒకటి లోకల్ బంగారం దొ...