భారతదేశం, నవంబర్ 17 -- OTT Crime Thriller: క్రైమ్ థ్రిల్లర్ సినిమాలంటే భారీ యాక్షన్, భయానక రక్తపాతం, చెవులు చిల్లులు పడే నేపథ్య సంగీతం ఉంటాయని అనుకుంటాం. కానీ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ఓ సినిమా వీటికి భిన్నమైనది. సంచలన సీరియల్ కిల్లర్ 'సైనైడ్ మోహన్' (Cyanide Mohan) వాస్తవ కేసు ఆధారంగా తెరకెక్కి, 7.2 ఐఎండీబీ రేటింగ్ సాధించిన ఈ చిత్రం ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ వేదిక సోనీ లివ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా కథాంశం, బలాలు, బలహీనతల పూర్తి విశ్లేషణ ఇక్కడ చూద్దాం.

ఈ మలయాళం క్రైమ్ థ్రిల్లర్ సినిమా కథ 2005వ సంవత్సరంలో కేరళ - తమిళనాడు సరిహద్దు ప్రాంతాల్లో మొదలవుతుంది. ఆ పరిసర ప్రాంతాల్లో వరుసగా యువతులు అదృశ్యమవుతుండటం పోలీసులకు పెద్ద సవాలుగా మారుతుంది. ఒక యువతి మిస్సింగ్ కేసును దర్యాప్తు చేస్తున్న కేరళ స్పెషల్ బ్రాంచ్ ఆఫీసర్ ఎస్ఐ జయకృష్ణన్ (విన...