భారతదేశం, నవంబర్ 5 -- OTT Crime Thriller: ఒక నిజమైన పోలీస్ ఆఫీసర్ రాత్రింబవళ్లు పడే శ్రమ, కేసు విచారణలో ఎదురయ్యే ప్రాణసంకటాలు, నిద్రలేని రాత్రులు, సరిహద్దు దాటి వెళ్లినప్పుడు అనుభవించే మానసిక నరకం ఎలా ఉంటుందో కళ్లకు కట్టినట్లు చూపించిన సినిమాలు చాలా అరుదుగా ఉంటాయి. అలాంటి అరుదైన మైండ్ బ్లోయింగ్ యాక్షన్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లరే 'ధీరన్ అధిగారం ఒండ్రు' (తెలుగులో 'ఖాకీ' - Khakee).

విడుదలై ఏళ్లు గడుస్తున్నా, సోషల్ మీడియాలో ఈ సినిమా ఇప్పటికీ నెటిజన్ల నుంచి విశేష ప్రశంసలు అందుకుంటూనే ఉంది. ఐఎండీబీ (IMDb)లో 8.2/10 అత్యుత్తమ రేటింగ్‌తో నిలిచిన ఈ సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా స్టోరీ ఏంటి? అసలు ఎందుకు చూడాలో తెలుసుకోండి.

కథ విషయానికి వస్తే.. నిబద్ధత కలిగిన పోలీస్ ఆఫీసర్ డీఎస్పీ ధీరన్ తిరుమారన్ (కా...