భారతదేశం, అక్టోబర్ 14 -- OTT Crime Thriller: ఓటీటీ లవర్స్‌ని కడుపుబ్బా నవ్విస్తూనే మరోవైపు థ్రిల్ అందించే సరికొత్త ప్రైమ్ ఒరిజినల్ మూవీ డిజిటల్ స్క్రీన్‌పైకి దూసుకొస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన మోనాలిసా (Mona Lisa) పెయింటింగ్‌ను టార్గెట్ చేస్తూ సాగే హై-వోల్టేజ్ ఆర్ట్ హైస్ట్ క్రైమ్ కామెడీ థ్రిల్లర్ మూవీ 'మాస్టర్‌ప్లాన్' (Masterplan) అక్టోబర్ 16 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) వేదికగా స్ట్రీమింగ్ కానుంది.

తెలుగుతో పాటు ఇటాలియన్, ఇంగ్లీష్, హిందీ, కన్నడ, తమిళ, మలయాళ భాషల్లో ఈ చిత్రం అందుబాటులోకి వస్తుండటంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రముఖ దర్శకుడు థామస్ విన్సెంట్ (Thomas Vincent) అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ చిత్రంలో హాలీవుడ్ లెజెండరీ నటుడు స్టాన్లీ తుచ్చి (Stanley Tucci), సిమోనా టబాస్కో, వి...