భారతదేశం, అక్టోబర్ 24 -- Sunil Fight Maha OTT Release: థియేటర్లలో మంచి స్పందన తెచ్చుకున్న సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ 'ఫైట్ మహా' ఇప్పుడు డిజిటల్ ప్రేమికులను అలరించేందుకు ఓటీటీలోకి అడుగుపెట్టింది. 'రాజు వెడ్స్ రాంబాయి' సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న అఖిల్ రాజ్, వర్సటైల్ నటుడు సునీల్ కీలక పాత్రల్లో నటించిన ఫైట్ మాహా ఓటీటీ రిలీజ్ అయింది.

రామ్ గోపాల్ వర్మ నిర్మించిన సంచలన చిత్రం 'మర్డర్'తో దర్శకుడిగా ఆకట్టుకున్న ఆనంద్ చంద్ర ఈ ఫైట్ మహా చిత్రాన్ని తెరకెక్కించారు. న్యూ ఐ మూవీస్ ఎల్ఎల్‌పీ బ్యానర్‌పై ఏవీఎస్ రాజు, ఆర్. కుమార్ రాజు, ఆనంద్ చంద్ర సంయుక్తంగా నిర్మించారు.

"కలలు నిజమైతే.. అది ఎవరి నిజం?" అనే డిఫరెంట్ ట్యాగ్‌లైన్‌తో రూపొందిన ఈ చిత్రం ఆగస్ట్ 21న థియేటర్లలో విడుదలైంది. ఇటీవలి కాలంలో తెలుగు ఓటీటీల్లో కాన్సెప్ట్ ఆధారిత చిత్రాలకు, సైకలాజికల్ థ...