భారతదేశం, సెప్టెంబర్ 13 -- D 16 OTT Streaming On 2 Platforms: సెలవు రోజుల్లో ఇంటి పట్టున ఉంటూ ఓటీటీ లవర్స్ ఎక్కువ భాగం సస్పెన్స్, మర్డర్, క్రైమ్, మిస్టరీ చిత్రాల వైపే మొగ్గు చూపుతుంటారు. అయితే దొరికే ప్రతీ సినిమా ఆకట్టుకోవాలని లేదు. ఫైట్లు, అనవసరమైన కామెడీ సన్నివేశాలు లేకుండా, కథ ప్రారంభం నుంచి చివరి దాకా సీటు అంచున నిలిపే థ్రిల్లర్లు అరుదుగా వస్తుంటాయి.

అటువంటి కేటగిరీలో మాస్టర్‌పీస్‌గా నిలిచిన సౌత్ ఇండియన్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీ 'డి-16' (ధ్రువంగల్ పతినారు). మరీ బీభత్సమైన స్టార్ డమ్ లేని నటీనటులు, భారీ బడ్జెట్ హంగులు లేకపోయినా కేవలం బలమైన స్క్రిప్టుతో థియేటర్లలో సంచలనం సృష్టించిన చిత్రమిది.

2016లో విడుదలైన డి 16 సినిమాను కార్తీక్ నరేన్ అనే 22 ఏళ్ల కుర్రాడు తెరకెక్కించాడు. కాలేజీ చదువును మధ్యలోనే ఆపేసి, కేవలం సినిమాపై ఉన్న పిచ్చ...