భారతదేశం, మే 24 -- Revenge Crime Thriller Shesha 2016 OTT Streaming: ఓటీటీ ప్రేక్షకులకు సస్పెన్స్, మిస్టరీ థ్రిల్లర్ జోనర్లంటే ఎప్పుడూ ఉండే క్రేజే వేరు. స్క్రీన్ ముందుకు రాగానే సీట్ ఎడ్జ్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చే ఓటీటీ చిత్రాల కోసం సినీ ప్రియులు నిరంతరం వెతుకుతుంటారు. ఈ క్రమంలోనే సరికొత్త కథాంశంతో, మైండ్ బ్లోయింగ్ సస్పెన్స్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది 'శేష 2016'.

టాలీవుడ్‌లో 'దృశ్యం' లేదా 'హిట్' లాంటి ఇన్వెస్టిగేషన్, రివేంజ్ క్రైమ్ థ్రిల్లర్లకు ఆదరణ చాలా ఎక్కువ. అదే కోవలో, పోలీస్ డిపార్ట్‌మెంట్‌లోని చీకటి కోణాన్ని ఆవిష్కరిస్తూ, ఒకే రాత్రిలో జరిగే కథతో శేష 2016 చిత్రాన్ని ఉత్కంఠభరితంగా తెరకెక్కించారు.

చట్టాన్ని కాపాడాల్సిన కొందరు పోలీస్ అధికారులు తమ స్వార్థం కోసం వ్యవస్థను ఎలా వాడుకున్నారనే పాయింట్ చుట్టూ ఈ సినిమా తిరుగుతుంది. లంచాలు, అధ...