భారతదేశం, మే 25 -- Telugu Comedy Action Thriller Jetlee OTT Release Today: వెండితెరపై తనదైన మేనరిజమ్స్, టైమింగ్‌తో నవ్వించిన కమెడియన్ సత్య హీరోగా మారిన సినిమా జెట్లీ. తెలుగులో కామెడీ యాక్షన్ థ్రిల్లర్ మూవీగా జెట్లీ సినిమాను తెరకెక్కించారు.

'మత్తు వదలరా' లాంటి విభిన్నమైన విజయవంతమైన చిత్రంతో టాలీవుడ్‌లో సరికొత్త ట్రెండ్ సెట్ చేసిన దర్శకుడు రితేష్ రాణా జెట్లీ సినిమాను తెరకెక్కించారు. సరికొత్త కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ క్రైమ్ కామెడీ థ్రిల్లర్ జెట్లీ ఓటీటీలోకి ఇవాళ (మే 25) వచ్చేసింది. థియేటర్లలో పెద్దగా ప్రభావం చూపలేకపోయిన ఈ తరహా విభిన్న చిత్రాలకు ఓటీటీల్లో మంచి ఆదరణ దక్కుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే జెట్లీ ఓటీటీ రిలీజ్ అయింది.

జెట్లీ సినిమా కథ అంతా 'స్వింగ్‌ఫిషర్ 6EB1CH' అనే ప్యాసింజర్ విమానం లోపల జరుగుతుంది. దేశం విడిచి పారిపోవాలని చూ...