భారతదేశం, సెప్టెంబర్ 15 -- OTT Bold: టీజర్ విడుదలైనప్పటి నుంచే బోల్డ్ సీన్స్, డబుల్ మీనింగ్ డైలాగ్స్‌తో కాంట్రవర్సీకి దారితీసిన మూవీ 'హుషార్ పిట్టలు'. థియేటర్లలో బాగానే మెరిసిన ఈ మూవీ ఇప్పుడు సడెన్ గా ఓటీటీలోకి వచ్చేసింది. చడీచప్పుడు లేకుండా స్ట్రీమింగ్ అవుతోంది.

టీనేజర్స్ మధ్య ఉండే లవ్, అట్రాక్షన్, సెక్స్, ఫ్యామిలీ ఎమోషన్స్ ఆధారంగా ఈ హుషార్ పిట్టలు మూవీ తెరకెక్కింది. అన్ష్ థోరత్, వాసవి గణేషన్ జంటగా నటించిన ఈ చిత్రం ఆగస్టు 15, 2026న థియేటర్లలో రిలీజైంది. బాక్సాఫీస్ వద్ద సినిమా విజయం సాధించింది. అప్పుడు భిక్షు దర్శకత్వం వహించిన ఈ సినిమాపై విమర్శలు కూడా వచ్చాయి.

హుషార్ పిట్టలు అనేది పూర్తిగా అడల్ట్ కంటెంట్ తో సాగి, ఆఖర్లో ఓ మెసేజ్ ఇచ్చే మూవీ. సినిమాలో రవి అనే కుర్రాడు బాగా చదువుతాడు. టెన్త్ టాపర్ కూడా. అతనికి చదువు తప్ప మరొకటి తెలియదు. కా...